సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలకు కొరియోగ్రాఫర్ గా అంతకు మించి ..గత ఎన్నికల ముందు తాను పవన్ బాటలోనే నడుస్తానని ఆయన సమక్షంలో ‘జనసేన పార్టీలో’ చేరి ఏపీలో పవన్ కళ్యాణ్ కోసం మంచి క్యాంపెన్ చేసిన జానీ మాస్టర్ ఫై ఒక యువతి తనను భయపెట్టి పలుమారులు అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. యువతి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు. అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరిం పు (506) మరియు గాయపరచడం(323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాని మాస్టర్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌ స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సినీ కొరియోగ్రాపర్స్ యూనియన్ లోని పలు వివాదాలలో ఆయనపై పిర్యదులు ఉన్నాయి. మరో వైపు జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. జానీ మాస్టర్ కు ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు జానీ మాస్టర్. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా ఇలా మరోసారి కేసుల బారి పడటం అతని కెరీర్ కు ముప్పుగా పరిగణించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *