సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అర్ధరాత్రి బాత్ రూములో జారిపడటంతో ఆయన ను నేటి శుక్రవారం ఉదయం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి లో చేర్చారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వైద్యులు తాజగా హెల్త్ బులెటిన్ విడుదల విడుదల చేశారు. తీవ్రంగా దెబ్బతిన్న ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు ప్రకటించారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు వైద్యులు గుర్తించారు. నేటి సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని రేవంత్ పేర్కొన్నారు.
