సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో గత 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ప్రతి ఐదేళ్లకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చుతున్నారు ఓటర్లు. అయితే ఈ సారి వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరెన్ దూసుకుపోతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024: జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్(జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు. దీంతో ఎలాగైనా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 53 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 గా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు 26 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *