సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని కలెక్టర్ చాంబర్లో, కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్ల స్థాపనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లు త్వ రితగతిన గ్రౌండింగ్ అయ్యేలా సంబంధిత అధికారులు కృషిచేయాలని, అత్యధిక సబ్సిడీ ఇచ్చే పథకంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లు ఉన్నాయని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి యూనిట్ల స్థాపకు ముందుకు వచ్చేలా ప్రోత్స హిం చాలన్నారు అన్ని కేటగిరిలలోని యూనిట్ల స్థాపనకు లబ్ధిదారుల ఎం పికను త్వరితగతిన పూర్తిచేసి రుణాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. రూ.50 లక్షల యూనిట్ స్థాపనకు భీమవరంలో గుర్తించిన స్థలాన్ని లీజుకు ఇవ్వ డానికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. నిర్ధేశించిన స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పిం చాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు. నాలుగు, మూడు, ద్వి చక్ర వాహనాల ద్వారా వ్యా పారం చేసే లబ్ధిదారులకు వెంటనే వాహనాలను సబ్సిడీపై అందించేందుకు బ్యాంకులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
