సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం విష్ణుపూర్ లోని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, క్యాంపస్ నందు కొత్తగా ఏర్పాటు చేసిన స్క్వాష్ కోర్ట్ క్రీడా సౌకర్యాన్ని ఆ సంస్థ చైర్మన్ శ్రీ కె.వి. విష్ణు రాజు నేడు, శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కె.వి. విష్ణు రాజు విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఆరోగ్యం కోసం క్రీడలలో అందరు పాల్గొనాలని, దీనికి ఎటువంటి వయోపరిమితి ఉండదని, కావున విద్యార్థులు, సిబ్బంది అందరూ స్క్వాష్ క్రీడను నేర్చుకొని, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. స్క్వాష్ కోర్టు ఏర్పాటుకు సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించామని, ఈ స్క్వాష్ కోర్ట్ సౌకర్యం జిల్లాలోనే ‘మొదటిది’ అని, కావున ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకొని, క్యాంపస్ లో క్రీడా కార్యకలాపాలు మరింతగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థులు, సిబ్బంది తోడ్పడాలని .. మన జీవితంలో ‘పోటీ మనస్తత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ప్రత్యేక పాత్రను పోషిస్తాయని, కావున క్రీడలను మన నిత్య జీవితంలో ఒక భాగంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ ఆర్.రవిచంద్రన్ వివిధ క్యాంపస్ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
