సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీ అర్హులైన చేపలు, రొయ్యలు పండిస్తున్న ఆక్వా రైతులు 13,850 మంది ఉన్నట్టు గుర్తించామని జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి, భీమవరంలోని కలెక్టరేట్ లోని కార్యాలయంలో ప్రకటించారు. నిబంధనలు మేరకు వారి అర్హతలకు సంబంధించి అన్ని తనిఖీలు పూర్తి చేసి వారికి విద్యుత్‌ సబ్సిడీ మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే జిల్లాలో వరి పండిస్తున్న రైతులకు రైతు భరోసా ద్వారా ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో 3 లక్షల 66 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.746 కోట్లకు రూ.729 కోట్లు రైతులకు చెల్లించామని ఇంకా రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *