సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండి నియోజకవర్గానికి తరలిస్తున్నారని తెలియడం తో ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన స్థానిక మార్కెట్ యార్డ్ స్థలంలో కలెక్టరేట్ నిర్మించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని లీకులు రావడంతో భీమవరం పట్టణంలో రాజకీయాలకు అతీతంగా ఒక అలజడి మొదలయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు కూడా దీనిపై తన అభ్యన్తరం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో స్థానిక ఉండి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాజగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భీమవరం పట్టణం శివారు లోనే పెద్దమిరం ఉందని, నా నివాసం ఇక్కడే ఉందని స్పష్టం చేశారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకి కూడా ముందే తెలిపాను. అవసరమైతే పెద అమిరం గ్రామాన్ని కూడా భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం పెద్దమిరంలో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని దీనిపై కొంత మంది సంకుచిత స్వభావంతో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, దీనిపై పోరాటం చేస్తామని అన్న తప్పు లేదని అది వారి హక్కు అని అన్నారు. కలెక్టర్ ఆఫీసుకు రూ.70 కోట్లు ఖర్చు ప్రతిపాదన అయితే.. అందులో రూ.35 కోట్లు ప్రభుత్వం, మరో రూ.35 కోట్లు ‌తాము స్వయంగా సమకూర్చామని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించాలని అనుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్ర శాసనమండలి మండలి చైర్మన్, మోషేను రాజు నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ భూమి అని అన్నారని.. కానీ తానే కలెక్టరేట్ కు స్థలాన్ని సమకూర్చానని, త్వరలో శంకుస్థాపనకు రావాలని సీఎం చంద్రబాబు ను కోరానని కుండ బ్రద్దలు కొట్టి మాట్లాడారు. నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ ఇప్పటికి అద్దె భవనంలో కొనసాగుతోందని తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో కలెక్టరేట్‌‌కు స్థలం కేటాయింపు నిజమేనని మరి ఏ కారణం? చేత అది ముందుకు కదలటం లేదని ప్రశ్నించారు. తాను భీమవరం, ఉండి కలబోత నియోజక వర్గాలని భావిస్తానని రెండు వేరువేరు అని భావించనని జిల్లా అంతా ఒకే యూనిట్ గా భావిస్తానని ప్రజలు అర్ధం చేసుకొంటారని రఘురామా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *