సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం సాయంత్రం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. అపోహలు .. భ్రమలు .. అవాస్తవాలు వద్దు .. జిల్లా కలెక్టరేట్ భీమవరం నియోజక వర్గంలోనే ఉంటుంది.. ఏ నియోజకవర్గానికి తరలి వెళ్ళదు, అపోహలు .. భ్రమలు .. అవాస్తవాలు వద్దు అన్నారు. అయితే అందరు అనుకున్నట్లు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కేటాయించిన స్థలంలో కాదని అన్నారు. జిల్లా కలెక్టరేట్ అనేది జిల్లా ప్రజలు అందరికీ ఉపయోగకరమైనదని, అందరూ అధికారులు ఒకే చోట ఉండాలన్నదే నా ఆలోచన అని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలంటే సుమారు 25 ఎకరాలు స్థలం కావాల్సి ఉందన్నారు. దాని కోసం దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తాడేరులో స్థలాలను చూస్తున్నామని, కలక్టరేట్ సుందరీకరణంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలో 7గురు ఎమ్మెల్యేలకు సంతృప్తి కలిగించే విధంగా భీమవరం నియోజకవర్గం లో కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తామని, ఇక్కడి నుండి తరలి వెళ్ళడం అనేది అవాస్తవమని ఉండి ఎమ్మెల్యే రఘురామా.. వ్యాఖ్యలను పరోక్షంగా త్రిప్పి కొట్టారు. (అయితే, నిజానికి భీమవరం పట్టణానికి అతి దగ్గరగా ఉండే పెదమిరం కన్నా ఇంకా ఎక్కువ దూరంలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తామనడం ఇబ్బందికర అంశం.. ప్రభుత్వ జిఓ లో ఉన్న మార్కెట్ యార్డ్ స్థలం లో త్వరితంగా కలెక్టరేట్ నిర్మిస్తే కాలయాపన ఉండదు.. పునః పరిశీలిస్తే మంచిది)
