సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం వారి విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని CSE 2nd ఇయర్ విద్యార్థి వై. భార్గవ్ ఈ నెల 8వ తేదీన డా. బి.వి. రాజు మునిసిపాల్ పార్క్ వీరమ్మ చెరువు దగ్గర జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ పోటీలలో 165+ ఎత్తు కేటగిరీ లోని “టెస్ట్ ఫీజిక్ ఇన్ మోడలింగ్” విభాగం నందు ప్రధమ స్థానం సాధించిన నేపథ్యంలో నేడు, బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు మిగతా ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీలక్ష్మి, కళాశాల ఫీజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు, HODS మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ విజేతను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *