సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కారం కోరుతూ సిపిఐ ఇచ్చిన పిలుపుమేరకు నేడు, సోమవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతికు సమర్పించారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ .. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం కాలయాపన కారణంగానే మాండుస్ తుఫానుతో ధాన్యం రాశులు తడిసి వరి పంట రైతాంగం తీవ్ర నష్టాలకు గురై దిక్కుతోచని స్థితిలో వున్నారన్నారు..వర్షాలతో పంట నష్ట పోయిన వరి, ఉద్యాన పంటల రైతులకు ఆర్థిక సాయమందించి రుణమాఫీ చేయాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కు మీటర్లు పెట్టాలనే ఆలోచన విరమించు కోవాలన్నారు.ఇన్పుట్ సబ్సిడీ, భీమా పరిహారం ,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రైతాంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు దేవాదాయ కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు వయసు దాటిన రైతులకు ప్రతీనెల పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ,ఆక్వా సాగుదారులందరికీ విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే ఇవ్వాలన్నారు. ధర్నాకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలి శెట్టి వెంకట్రావు, నెక్కంటి సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ కార్యవర్గ సభ్యులు ఎం. సీతారాం ప్రసాద్ ,సిహెచ్. రంగారావు,కళింగ లక్ష్మణరావు,తదితర సిపిఐ , పార్టీ ప్రజాసంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
