సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రహదారులపై రోడ్ షో లు,ర్యాలీ లు,బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వంతీసుకొచ్చిన జీవో నంబరు 1ని ఈ నెల 23 వరకు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జీవో నెం .1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఫై నేడు, గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన డివిజన్ బెంచ్, దీనిపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.
