సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేటి మంగళవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి పెద్ద ఎత్తున నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రారంభించి రైతులకు ఇటీవల జీఎస్టీ పన్నులు కేవలం 5 శాతం స్లాబ్ కు తగ్గించడం వల్ల జరిగిన ప్రయోజనాలను వివరించారు. రైతులు కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు ఫై పన్నులు తగ్గించడం వల్ల ఇకపై తక్కువ ధరలకే లభ్యం అవుతాయని, దేశీయ రైతుల ప్రయోజనాల కోసం, వారి పంటలు అమ్మకాలు కోసం ప్రధాని మోడీ అమెరికా అంక్షలు ను వ్యతిరేకిస్తున్నారని, దేశంలో రైతుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోడీ , రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు రైతు భరోసా పెంపు తదితర ప్రధకాలు తో అడుగులు వేస్తున్నాయని.అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజ్య సభ సభ్యులు పాక సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ మాజీ రాజ్య సభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి తదితరులు కూటమి నేతలు పాల్గొన్నారు.తదుపరి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *