సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చంద్రబాబు రోడ్డు షోలలో జరిగిన అపశృతులు 11 మంది మరణించిన దృష్ట్యాఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రధాన రహదారులపై రోడ్డుషోలు, ర్యాలీలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం జారీ చేసిన జీవో నంబర్ 1పై హైకోర్టు స్టే ఇవ్వడం ఫై దానిని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నతిపై..విచారణ నేడు, శుక్రవారం ముగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం నేడు,శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1పై జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై ఈ నెల 23వ తేదీన విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద,ప్రతివాదులిరువురూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది.
