సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ సందర్భముగా నేడు, శనివారం బోగి మంటలు వేసే కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నేతల సమక్షంలో ప్రారంభించారు. భోగి మంటల కార్యక్రమంలో నారా చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలో పబ్లిక్ రోడ్లపై మీటింగ్స్, ర్యాలీలు అడ్డుకొంటు ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1 ను భోగి మంటల్లో వేసి తగలబెట్టి బోగి పండుగ రోజు తమ నిరసన తెలియజేసారు.రాష్ట్రంలో ఈ నియంతృత్వ ప్రభుత్వ పాలనలో అంధకారం అలముకొంటుందని ఈ సంక్రాంతి బోగి రోజున టీడీపీ నేతలు ప్రజలు రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆ భగవంతుని కోరుకోవాలని చంద్రబాబు సూచించారు.
