సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హిందూ సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తోందని, దేవాలయాల భూములను, వేల ఎకరాలను తమ సన్నిహితులకు ఏకముగా 33 ఏళ్ళ లీజు కు రెన్యూవల్ చేసేసి వాటిని గుట్టుగా కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తాజగా నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమకు కావలసిన వారికీ కావలసిన భూములను ఎటువంటి బహిరంగ పాటలు పెట్టకుండా ‘ఏకంగా 33 ఏళ్ళు లీజు’ ఇవ్వడానికి, న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పులు ఉల్లంఘిస్తూ, హిందూ సంఘాలను సంప్రదించకుండా, కాబినెట్ చర్చ లేకుండా రహస్యంగా జీవో 139 తెచ్చారని , హిందూ దేవాలయాల నిర్వహణకు పూర్వము నుండి దాతలు ఎంతో ముందుచూపుతో ఎకరాల భూములు దేవుళ్ళకు రాసి ఇస్తే .. వాటిని గత ప్రభుత్వాలు బహిరంగ వేలం పాటలలో ఒకటి 2 ఏళ్లకు కౌలు కు ఇస్తే.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆ భూములను కబళించడానికి జీవో 139 తెచ్చారని దీనిని హిందూ వాదులు, ప్రజలు అందరు వ్యతిరేకించాలని జీవో 139 తక్షణం ఉప సంహరించే వరకు వైసీపీ పోరాటాం చేస్తుందని పిలుపు నిచ్చారు. సనాతన హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని దేవాలయ నిర్వాహణాలను భక్తుల సౌకర్యాలు బ్రష్టు పట్టించారని , ఇప్పుడు భూములపై పడ్డారని కూటమి నేతలను విమర్శించారు
