సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జీ20 సమావేశాల్లోపాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన అమెరికా అధ్యక్షుడు సమావేశాలు ముగిశాక వియత్నాం బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ మొట్టమొదటిసారి భారత్ లో పర్యటించారు. జీ20 సమావేశాలు రెండోరోజు ఉదయాన్నే భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వియత్నాం బయల్దేరారు. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. సమావేశాలు విజయవంతం అయ్యాయి. జీ20 సమావేశాలు ఒకపక్కన జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు తొలి రోజున మారిషస్, బంగ్లాదేశ్ దేశాలతో చర్చలు జరిపారు. రెండో రోజునయూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఆదివారం రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని లంచ్ సమావేశం అది ముగిశాక కెనడా దేశాధినేతలతోనూ అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్‌యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వై పాక్షిక చర్చ లు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయాదేశాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
జయహో భారత్..
రెం డు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవం తం గా నిర్వ హిం చిం ది. సమేవేశాలు తొలిరోజునే ప్రధాని ప్రతిపాదిం చిన ఢిల్లీ డిక్లరేషన్ విషయం లో
భాగస్వా మ్య దేశాల ఏకాభిప్రాయం సాధిం చడం భారత్ సాధిం చిన అపూర్వ విజయమనే చెప్పా లి. సమావేశాలు ముగిం పు సం దర్బం గా ప్రధాని ప్రతిపాదిం చిన ‘వన్ ఎర్త్
నేషన్’పై సభ్య దేశాలు హర్షం వ్య క్తం చేశాయి.
