సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మీదుగా హైదరాబాద్ కు రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు ముఖ్య గమనిక .. గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్, లింగంపల్లి(Cherlapalli, Kakinada)కి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల (Guntur) మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది. (07448) చర్లపల్లి – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది.
