సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే జులై నెల నుండి రైల్వే తత్కాల్ టికెట్ల(Tatkal Tickets)కు సంబంధించి రైల్వే శాఖ (Indian Railway) మరో కొత్త నిబంధన అమల్లోకి తీసుకురాబోతోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆధార్ కలిగి వారి నెంబర్ చెప్పిన ప్రయాణికులకు మాత్రమే (Aadhaar authentication) వ్యక్తులకే తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ అథంటికేటెడ్ కాని వ్యక్తులు జులై 1 తర్వాత తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు .ఇక, జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేయబోతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్ చేసే అవకాశాన్ని తొలి అరగంట ఇవ్వబోమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అంటే ఏసీ కోచ్ టికెట్లను ఉదయం 10:30 తర్వాత, స్లీపర్ క్లాస్ టికెట్లను ఉదయం 11:30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లు బుక్ చేయడానికి వీలవుతుంది.
