సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా వచ్చే గురువారం స్కూళ్లు, కాలేజీల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. కేంద్రము లోని మోడీ సర్కార్ కార్పొరేట్ విద్య సంస్థలను ప్రోత్సహిస్తూ, ఉన్నత వర్గాలకు మాత్రమే ఉన్నత చదువును అందుబాటులో ఉంచి కస్టపడి చదువు కుంటున్న పేద విద్యార్థులను పరీక్షలలో కూడా మోసం చేస్తుందని ఆ విషయం ఆధారాలతో పాటు దొరికేసినప్పటికీ మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ.. ఇటీవల నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని SFI , AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్రపతి ఎన్టీఏ అభిశంసించాలని, ప్రభుత్వాన్ని కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ పార్లమెంట్ లో , విద్యార్థి సంఘాలతో చర్చించి న్యాయం చేయాలని కోరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *