సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తుల దర్శనాల సౌకర్యార్థం వచ్చే జూన్ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు : మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్‌లకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలాగే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను టిటిడి విడుదల చేస్తారు. మార్చి 21న ఉదయం 10 గంటలకు జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు.
