సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గుడివాడ లో జరిగిన వైసీపీ సమావేశానికి హాజరు అవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాము కారు ను చుట్టుముట్టి కారు అద్దాలు పగుల గొట్టిన దాడి అన్ని టివి ఛానెల్స్ లో లైవ్ కవర్ అయ్యింది. దీనిపై టీడీపీ జనసేన నేతలు తమపై దాడికి దిగారని, బూతులు తిట్టారని అయిన పోలీసులు పట్టించుకోలేదని వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాము పై తాజగా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నాగవరప్పాడు వంతెన వద్ద జడ్పీ చైర్మన్ కారు ఢీకొట్టడంతో తెలుగు మహిళా నేత మాదాల సునీత చేతికి గాయాలు అయ్యాయని కాస్త ఆలస్యంగా పిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం సునీత చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉప్పాల రాము, వైసీపీ నేత కందుల నాగరాజుపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న వైసీపీ నేతలు తనను వల్గర్‌గా దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు మహిళా నేత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము, సహా కొంతమంది వైసీపీ నేతలపై 129(a) 79, r/w 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది కావాలని నా భర్తనే ఇదే కేసుతరహా లో ఇరికిస్తున్నారని వైసీపీ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
