సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జేఈఈ మెయిన్-2023పై జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్ 6 నుం చి ప్రారంభిస్తామని ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు . ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో, చివరి విడత ఏప్రిల్ 6 నుం చి 12వ తేదీ వరకు జరుపుతామని ప్రకటించింది. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్, బీ-ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్-2, మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరీక్షా కేంద్రలుగా భీమవరం, ఏలూరు ఉంటాయి. విద్యా ర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *