సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 3వారాలు ఢిల్లీలో గడిపిన నారా లోకేష్ తిరిగి ఏపీ వచ్చారు. తదుపరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తండ్రి చంద్రబాబుతో 45 నిమిషాలపాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలసి సమావేశం అయ్యారు. తదుపరి బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. పోరాడితే దొంగ కేసులు పెట్టారు. చంద్రబాబును 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారు. పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. స్కిల్ కేసులో మొదట రూ. 3 వేల కోట్ల అవినీతి అన్నారు. ఇప్పుడు రూ.300 కోట్ల అవినీతి అంటున్నారు. మళ్లీ టీడీపీ పార్టీ ఖాతాలోకి రూ. 27 కోట్ల అవినీతి అని అంటున్నారు. కావాలని కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలుకు పంపారు. చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు. రిమాండ్‌లో ఉంచిన చంద్రబాబు అధైర్య పడలేదు. పోరాటం ఆపవద్దు.. శాంతియుతంగా పోరాడాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీ శ్రేణులు ప్రజలు రేపు రాత్రి 7 గంటలకు ప్రతి ఇంట కరెంట్ ఆపి కొవ్వొత్తలు, సెల్ ఫ్లాష్‌లైట్లతో సంఘీభావం తెలిపాలి. మా కటుంబం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. టీడీపీ-జనసేన కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ వేస్తాం. సంయుక్త కార్యాచరణ కమిటీ సూచనలతో ముందుకు వెళ్తాం. అని లోకేష్ అన్నారు.
