సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ నేటి శుక్రవారంతో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో మరో రెండు రోజులపాటు చంద్రబాబు రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆయనను తన కస్టడీకి కోరుతూ.. ఆయనపై మరిన్ని అవినీతి కేసులు సీఐడి బయటకు తీస్తున్న నేపథ్యంలో .. మరో ప్రక్క కేంద్ర ఐటి శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో .. ఈడీ కేసు పొంచి ఉన్న నేపథ్యంలో జైలు నుండి చంద్రబాబు ఎప్పటికి బయట పడతారో? ఒకవేళ బయట పడిన ప్యూహాత్మకంగా మరో కేసులో.. అన్న సందేహం టీడీపీ శ్రేణులలో వెంటాడుతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *