సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి సెంట్రల్ జైలు లో చంద్రబాబు కు 30 రోజులు గడిచాయి. అయితే కోర్ట్ తీర్పులు వాయిదాలు వెయ్యకపోతే రేపు సోమవారం చాలా కీలకమైన రోజు .. మంచి జరిగిన, చెడు జరిగిన ఆయన జీవితం భవిషత్తు ను నిర్దేశిస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటీషన్‌లపై రేపు సోమవారం సుప్రీంకోర్టు , హైకోర్టు , విజయవాడ ఏసీబీ కోర్టు లలో తీర్పులు, విచారణ జరగనున్నాయి. అలాగే హై కోర్టులో చంద్రబాబు పిటీషన్లపై కూడా సోమవారం తీర్పు రానుంది. అంగాళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో బెయిల్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌లపై హై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. ఇక కీలకమైన సోమవారమే సుప్రీం కోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై విచారణ జరగనుంది. అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు వెలువడనుంది. ఈ పిటీషన్‌లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కాగా హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, ముందస్తు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అసలు వాస్తవాలు ఏమిటి అన్నది ప్రక్కన పెడితే.. చంద్రబాబు 74 ఏళ్ళ వయస్సులో ఇన్ని కేసులు విచారణలు టెంక్షన్స్ లు తట్టుకోవడం అంటే.. వావ్…
