సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ ,ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లతో సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా సుప్రీం కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ ముగిసే వరకు దర్యాప్తు అధికారికి తెలియకుండా దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. మాజీ మంత్రి జోగితో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును వైసీపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై గత మంగళవారం జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి వారికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
