సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో నేడు, మంగళవారం కొద్దీ సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి జోగి రమేశ్ కు వ్యతిరేకంగా సుమారు 100 మంది జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.వారు మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. జనసేన కార్యకర్తలను వెంబడించి వస్తున్నా పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి లాక్కెళ్లి జీపులో ఎక్కించారు, ఈ ఘటనలో దిష్టి బొమ్మ లాగేసుకున్న పోలీసులకు జన సేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది, ఈ నేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. జోగి రమేష్‌ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాలన్నారు. ‘‘నువ్వు తార్పితేనే ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి నీకు వచ్చింది. జోగి రమేష్ .. దమ్ముంటే మంత్రి పదవి పక్కన పెట్టి రారా. విజయవాడ నడి రోడ్ల పై బట్టలూడదీసి నిన్ను కొడతాం. అధికార మధంతో అడ్డగోలుగా వాగుతావా.? జగన్ ఎన్నికలలో మరల నీకు సీటు సీటు ఇవ్వడనే భయంతోనే కారుకూతలు కూస్తున్నాడు. ఎనిమిది నెలల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం’’ అంటూ వాసు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
