సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ను అయన సోదరుడు రామును అరెస్ట్ చేసిన పోలీసులు, వారికీ ఈనెల 13వ తేదీ వరకు కోర్డు రిమాండ్ విధించిన నేపథ్యంలో వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. అయితే తాజా వార్త సమాచారం మేరకు పోలీసులు ప్రస్తుతం జోగి రమేష్ కుమారుడుపై కూడా కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. నిన్న(ఆదివారం) ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్‌ను హాజరు పరిచే సమయంలో ఆయన కుమారుడు వైసీపీ అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని జోగి కుమారుడిని కూడా అరెస్ట్? చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
