సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భావితరాలలో మన మహనీయుల చరిత్ర తెలియజెప్పాలంటే ముఖ్యంగా ప్రతి పాఠశాలలో విగ్రహాలు నెలకొల్పలని, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు శతాబ్దాల క్రితమే విద్య వ్యవస్థలో పలు సంస్కరణలు చేశారని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు నేడు, ఆదివారం అన్నారు. 19 జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే రాఘరామ కృష్ణంరాజు సంఘ సేవకులు రంగసాయికి ఎమ్మెల్యే భీమవరం శివారులోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యే రఘురామా.. మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే విగ్రహాలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయడానికి విగ్రహాలు తయారు చేయించామని, ఈ విగ్రహ ప్రతిష్టలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసి పూలె ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు తెలియజేయాలని ఎమ్మెల్యే రాఘరామ కృష్ణంరాజు అభినందలు తెలిపారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన సందర్బంగా ఎమ్మెల్యే ను పలువురు సత్కరించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ వేగేశ్న చైర్మన్ కనకరాజు సూరి, కొత్తపల్లి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
