సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ని పలు సంఘాలు నేతలు, అభిమానులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నేడు, మంగళవారం భీమవరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఫూలే జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం మాట్లాడుతూ.. భారతదేశంలోనే ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు. అణగారిన ప్రజల కోసం, వారి హక్కుల కోసం నిలబడినటువంటి గొప్ప సామాజిక వేత్త అన్నారు.సామజిక నాయ్యం, విద్య కోసం, సంస్కరణల కోసం పోరాడిన యోధుడన్నారు. ఆయనతో పాటుగా ఆయన సహచరిణి కూడా బాలికల విద్య కోసం దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గొప్ప కృషి చేశారన్నారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి తీరని ద్రోహం చేస్తుందని మండిపడ్డారు.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో కూడా బలహీన వర్గాల మీద, దళితుల మీద, మహిళల మీద దాడులు పెరుగుతూన్నాయన్నారు. జ్యోతిరావు ఫూలే స్పూర్తితో వీటిపైన మనమందరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
