సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టర్కీ కి దేశానికీ ఏర్పడిన పెను విప్పత్తులలో భారత్ అందించిన సహకారం అంతా ఇంతా కాదు. గతంలో కరోనా సమయంలో ఉచితంగా టీకాలు మందులు మరియు భూకంపం సమయంలో ఆహారం, దుప్పట్లు నిర్మాణ సామాగ్రి , వందల కోట్ల డబ్బు, భారత్ జవాన్ లను కూడా పంపి ఆదుకొంది. అయితే టర్కీ ని ఆదుకున్న చేతినే కాటు వెయ్యడానికి, విశ్వాస ఘాతుకానికి విఫలయత్నం చేసింది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు చెలరేగిన సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌లో టర్కీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే భారత దేశం పలు కాంట్రక్టులను రద్దు చేసింది. ప్రెవేటు సంస్థలు కూడా పలు ఐఎం ఓ లను కూడా టర్కీతో రద్దు చేసుకొన్నారు. ఇక వ్యాపార పరంగా వందల కోట్ల టర్కీ దేశ యాపిల్స్ దిగుమతులు , గ్రానైట్ రాళ్ల దిగుమతులు, బంగారు వ్యాపారం నిలిపివేయడం తోపాటు టర్కీ కి అతికిలకమైన పర్యాటకానికి టర్కీ దేశం వెళ్లకూడని భారత్ యాత్రికులు నిర్ణయించడం తో అక్కడ హోటల్స్ టూరిజమ్ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయింది. .తాజగా ఇప్పుడు ఏఐసీడబ్ల్యూఏ కూడా టర్కీలో భారతీయ సినిమాల షూటింగ్‌లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. అంతేకాకుండా, భారత నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, దర్శకులు, ఫైనాన్షియర్లు ఇక సినిమాలు, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రాజెక్టులను టర్కీలో చేయడానికి ఇక అనుమతి ఉండదు. దీనితో టర్కీ పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదులకు సాయం చేసుకొంటూ పేద దేశంగా దిగజారిపోవడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
