సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 నెలలుగా దేశవ్యాప్తంగా యాపిల్ పళ్ల ను మించిపోయి కేజీ టమాటా ధర 240 రూపాయలు వరకు దూసుకొనిపోయిన నేపథ్యంలో విస్తుపోయిన ప్రజలకు గత 2వారాలుగా మరల టమాటా ధర దిగి వాస్తు ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ కి 45 రూపాయలు పలుకుతుంది. ఇప్పడు ఏపీలో టమాటా దిగుబడి ఎక్కువ కావడంతో పాటు ఉత్తరాది నుండి కూడా డిమాండ్ పడిపోవడంతో తాజగా టమాటా ధరలు ఒక్క సారిగా పడిపోయాయి.రాయలసీమ లో టమాటా హోల్ సెల్ మార్కెట్ కు పేరెన్నిక కన్నా మదనపల్లి, పత్తికొండ వ్య వసాయ మార్కెట్ యార్డులలో టమాటా కొనుగోళ్లు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. నిన్న నేడు వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. దానితో .. కిలోకు రూ.10 కూడా దక్క లేదని రైతులు దిగాలు పడ్డారు ఇకపై రిటైల్ మార్కెట్ లో కూడా వినియోగదారులు మాత్రం కిలో టమాటాకు రూ. 25- 30 రూపాయల వరకు అందుబాటులో ఉండనుంది. మరల కేజీలకు కేజీలు కొనుగోలు చేసెయ్యవచ్చు..
