సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేజీ 60 రూపాయలు నుండిగత 2నెలలుగా భారీగా పడిపోయిన రిటైల్ మార్కెట్ లో కేజీ 20 రూపాయలకు దొరికింది. అయితే మరోసారి టమోటా ధర భారీగా కుప్పకూలింది దానితో భీమవరం పరిసర ప్రాంతాలలో గత ఆదివారం నుండి కేవలం కేజీ 10 చప్పున రిటైల్ గా పలు మాల్స్ లో సైతం విక్రయిస్తున్నారు. మరి టమాటా పంట ఎక్కువ గ పండే కర్నూల్ జిల్లాలో రైతుల వద్ద ఎమ్మిగనూరు హోల్ సేల్ టమాటా మార్కెట్ లో టమోటా 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు కు మాత్రమే హోల్ సేల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే.. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో రైతులకు కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని చేలలో వదిలెయ్యడం లేకపోతె గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న పలు దృశ్యాలు కనపడుతున్నాయి.
