సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పాక్ కు సైనిక ఆయుధ సహకారం అందించి భారతీయులందరికి నమ్మక ద్రోహం చేసి శత్రుదేశంగా మారిన టర్కీలో నేటి మంగళవారం ఉదయం పెను భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 23:17 UTCకి నమోదైన ఈ భూకంపం రోడ్స్ నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నప్పటికి అధికారికంగా వివరాలు ప్రకటించలేదు. గతంలో టర్కీ భారీ భూకంపాల భారిన పడినప్పుడు భారత్ అన్ని రకాలుగా ఎంతో ఆదుకునేది.
