సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కైండ్‌నెస్‌ సొసైటీ అధ్యక్షుడు గట్టి మాణిక్యాలరావుకు స్థానిక ఆకివీడు మండలానికి చెందిన మద్దా దానియేలు ఒక విజ్ఞప్తి చేసారు. తన కుటుంబ పోషణ కోసం తన భార్య టర్కీ దేశం వెళ్లిందని, నిజానికి ఏడు నెలల క్రితం తన భార్య రహేలు గల్ఫ్ దేశం ఖతార్‌ వెళ్లగా, అక్కడి ఏజెంట్‌ మోసం చేసి తుర్కియే పంపించారన్నారు. తుర్కియేలో తన భార్య పనిచేస్తున్న ఇంటి యజమాని తన భార్య ను చిత్ర హింసలు పెడుతున్నాడని, ఆమెకు భోజనం తిండి కూడా పెట్టకుండా దారుణంగా చాకిరీ చేయించుకుంటున్నారని, అది తెలిసి తన పిల్లలిద్దరూ బెంగ పెట్టుకున్నారని వాపోయాడు. రహేలు తండ్రి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, తన భార్యను రక్షించాలని కోరారు. టర్కీ లోని ఎంబసీతో సంప్రదించి వీలైనంత త్వరగా రప్పిస్తానని మాణిక్యాలరావు వారికీ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణ చేసి చొరవ చూపిస్తే ఆ కుటుంబాన్ని వేగంగా ఆదుకొన్నవారు అవుతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *