సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ,ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు పురోగతి ఫై మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరిగిన టార్చర్ ఫై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారని, ఇప్పటికే కేసులో నాల్గో నిండితుడైన సీఐడీ అదనపు మాజీ ఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో కొంతమంది నిందితులు మతిమరుపు వచ్చినట్లుగా నటించేవారు మినహా..మిగతా వారంతా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారని వ్యాఖ్యానించారు. కస్టోడియల్ టార్చర్ కేసు లో తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని తెలిపారు, అయితే కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారని అన్నారు. ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అవుతానని స్పష్టం చేశారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని ఇద్దరు వీఆర్వోల సమక్షంలో.. తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తప్పుడు లెటర్ సృష్టించిన దగుల్బాజీలు వీరని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభావతికి కూడా మెమరీ లాస్ వస్తుందేమో? ఫుల్ మెమరీ ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా రాష్ట్ర ప్రభుతం చూడాలని ఆయన పాస్ పోర్ట్‌ను తనిఖీ చేయాలని రఘురామా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *