సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ టీచర్స్ కు ఇంకా పెండింగ్ లో ఉన్న 4 డిఏ లను విడుదల చేయాలని, పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు వినతిపత్రాన్ని అందించారు. 12వ పిఎస్ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, సిపిఎస్ ని రద్దు చేసి కేంద్రమేమో 57 ప్రకారంగా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈహెచ్ఎస్ పరిమితిని 25 లక్షలకు పెంచాలని, అసెస్మెంట్ బుక్స్ రద్దు చేయాలని, అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని తదితర డిమాండ్లు కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ పిలుపుమేరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందిస్తున్నామని జిల్లా అధ్యక్షులు జి ప్రకాశం, మండల అధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి పి పీటర్, జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్ ఇతర సభ్యులు అన్నారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే అంజిబాబు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళతానని హామీ ఇచ్చారు.
