సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో టోకెన్ల జారీ వేళ.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై దేశం యావత్తు హిందూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాక్యలు చేసారు.నిన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటన లో భక్తులు చనిపోవడం తనను చాలా బాధించిందన్నారు.తప్పు జరిగింది. మృతుల కుటుంబాలకు, గాయాలు పాలయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను క్షమాపణలు చెపుతున్నాను. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను క్షమాపణలు చెప్పిన తర్వాత.. మీరు చెప్పడానికి వచ్చిన నామోషీ ఏమిటని ఈ సందర్భంగా వారిని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని.. మీకు వేరే దారి లేదన్నారు. బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడితే తనకు ఏడుపొచ్చిందని చెప్పారు. బాధితుల వద్దకు వెళ్లి.. వారి బాధ వింటే.. మీకు అర్థమవుతోందంటూ టీటీడీ బోర్డ్ చైర్మన్, ఈవోల లకు హితవు పలికారు. అలాగే ఇక్కడ పిఠాపురంలో పోలీస్ అధికారుల తీరు బాగోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దొంగతనాలు బాగా పెరిగాయంటూ పిఠాపురంలో గంజాయి వినియోగం సైతం పెరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు.
