సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం TTD బోర్డు మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ ధర్మకర్తల మండలిని ప్రకటించారు. వీరిలో భీమవరం పట్టణంలో మాజీ కౌన్సిలర్, ప్రముఖ వైసిపి నేత గాదిరాజు సుబ్బరాజు కు సభ్యత్వం ఇవ్వడం తో పట్టణంలో రాజకీయాలకు అతీతంగా ఆయన శ్రేయాభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుండి ఆయన ఉంగుటూరు కేంద్రంగా వైసీపీ పార్ట్ లో కీలక నేతగా కార్యాచరణ చేస్తున్నారు, మాకు వ్యక్తిగతంగా మిత్రులు గాదిరాజు సుబ్బరాజు కు మన సిగ్మా న్యూస్ తరపున అభినందలు తెలుపుతున్నాము. శ్రీవారి దర్శన భాగ్యం మన ప్రాంత భక్తులకు అందించడంలో ఆయన విశేష కృషి చేస్తారని భావిస్తున్నాము. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి మాజీ ఎమ్మెల్సీ , మేకా శేషు బాబు ను ఎంపిక చెయ్యడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు,
