సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, గతంలో ఉత్తరాంద్ర నుండి ఒరిస్సా వరకు విస్తరించి చరిత్రలో ప్రసిద్ధి పొందిన విజయనగర సామ్రాజ్య రాజుల వారసుడు అశోక్ గజపతిరాజుని (Ashok Gajapathi Raju) కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిబంధనల మేరకు గవర్నర్ పదవి స్వీకారానికి ముందుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు ఇన్నేళ్లు టీడీపీలో ఉన్నానని, టీడీపీ పార్టీ, సుదీర్ఘ కాలంగా నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. నేడు, శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో అర్చక స్వాములు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద అశోక్ గజపతిరాజును శాలువాతో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు. తదుపరి గవర్నర్ బాధ్యతల కోసం గోవా కు పయనం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *