సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని నేటి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల మాజీ సీఎం జగన్ ను విమర్శిస్తూ.. హిందూ మనోభావాలనురెచ్చగొట్టేలా.. చంద్రబాబు ఆఫీస్ నుండి వచ్చిన తప్పుడు పోస్టు లు బీజేపీ వాళ్ళు పెడుతున్నారని.. అంతర్వేది లో రధం దగ్ధం చేసిన ఘటన మర్చిపోదామా? అంటున్నారని.. మరి కొత్త రధాన్ని కొద్దీ నెలలు లో నిర్మించిన (కొత్త రధం లాగిన జగన్ ఫోటో చూపిస్తూ..) వారిని మర్చిపోదామా? ఆ రధం కేసు సీఎం జగన్ వెంటనే.. కేంద్రంలోని అమిత్ షా ఆధీనంలోని సిబిఐ కి బదిలీ చేస్తే ఆ ‘వెధవలును దోషులను’ ఇప్పటి వరకు పట్టుకోలేకపోయిన వారిని ఏమనాలో? బీజేపీ మాధవ్, పురంధరేశ్వరి సమాధానం చెప్పాలని .. తాడేపల్లి గూడెం బీజేపీ ఎమ్మెల్యేగా మంత్రిగా మాణిక్యాలరావు ఉన్నపుడు పెంటపాడులో రధం దగ్ధం చేస్తే ఇప్పటివరకు కేసు లేదు.. కొత్త రధం లేదు.. చంద్రబాబుతో కలసి మీ బీజేపీ పాలన చేస్తున్నప్పుడే కదా? గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోవడం మర్చిపోదామా? విజయవాడలో మీ కూటమి హయాంలో 200 పైగా దేవాలయాలు కూల్చివేస్తే వాటిని జగన్ సీఎం అయ్యాక నిర్మించింది మర్చిపోదామా? తిరుచానూరు లో వారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేత, తిరుమల లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేత.. ఎందరికో నిత్యా అన్నదాన చేసే ‘కాశినాయన క్షేతం’ కూల్చివేతలు మర్చిపోదామా? వై ఎస్ జగన్ను తిట్టిన టీడీపీ నేత పట్టాభికి దేవుడి ఆస్తు లను అక్రమం గా కట్టట్టారు. కొత్త చట్టం తెచ్చి మీ పాలనలో రాష్ట్రంలో దేవుళ్ళ ఆస్తులు ను మీకు నచ్చినవారికి 99ఏళ్ళు లీజుకు ఇస్తారా..? మీ టీడీపీ బీజేపీ కూటమి పాలనలో జరుగుతున్నా పాపాలను మర్చిపోదామా? అంటూ పేర్ని ఘాటుగా ప్రశ్నలు వర్షం కురిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాలుకు వాటి ఆస్తులకు రక్షణ , సీసీ కెమెరాల పర్యవేక్షణ వచ్చిందని మీరు మాత్రం దేవుడి పేరుతొ రాజకీయాలు మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు పేర్ని నాని..
