సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారా లోకేష్ టీడీపీ శంఖారావం రెండవ విడత కార్యక్రమాన్నిహిందూపురం నుంచి నేడు, గురువారం ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీ రామారావు ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఏమోగానీ.. పార్టీలో నాయకులు జంపింగ్ లు చేసి పార్టీలు మారిన కార్యకర్తలు మాత్రం గత 40 ఏళ్లుగా మారకుండా ఉంటూ వస్తున్నారు. వారికీ పార్టీ కోసం పనిచేయడమే వారికి తెలుసు తప్ప, ఏమీ తెలియదని వారికీ రుణపడి ఉన్నామని నారా లోకేష్ వాస్తవాలు మాట్లాడారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి కటింగులు, సెట్టింగులు, ఫిటింగ్ లు అలవాటు పడ్డాయి. ప్రజలకు బల్లపై రూ.10 ఇచ్చి, బల్లకింద రూ.100 లాక్కోవడం జరుగుతోంది. అదేలా అంటే.. విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, అధిక మద్యం ధరలు, పెంచేసాడని నారా లోకేష్ విమర్శించారు. ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పడితే, తెలుగుదేశం పాలన రావడం తద్యమన్నారు. వచ్చే ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యం అన్నారు. నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇవ్వడం, ప్రతి ఇంటికి విద్య కోసం ఏడాదికి 15,000 చొప్పున ముగ్గురు ఉన్నా కూడా 45,000 ఇస్తామన్నారు. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బీసీలకు డిక్లరేషన్ ప్రకటించి 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.నారా లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *