సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనపడుతోంది – వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి – జనసేన బీజేపీలతో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం, సీఎం జగన్ ను గద్దె దించాలి అని ఏకైక అభిప్రాయంతో ముందుకు వచ్చింది జనసేన – పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ – రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు ముందుకు వచ్చారు – జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు – పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం – సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు – మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం – మూడు పార్టీల ఆలోచన ఒక్కటే.. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేది లక్ష్యం – మనం అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదమూ ఉంది, సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు అందుకే అందరు సహకరించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పితాని సత్యనారాయణ, ఎమెల్య రామరాజు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్సీ అంగర రామోహనరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ వేదికపై అస్సినులు అయ్యారు.
