సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నమయ్య జిల్లాకు చెందిన 40 ఏళ్ళు పైగా టీడీపీ నే నమ్ముకున్న కుటుంబం.. మాజీ టీడీపీ ఎంపీ, పలుమారులు ఎమ్మెల్యే గా పనిచేసిన సుగవాసి పాలకొండ్రారాయుడు కుమారుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్,సుగవాసి సుబ్రహ్మణ్యం నేడు, బుధవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. సుగవాసి సుబ్రహ్మణ్యం గతంలో జిల్లా పరిషత్తు చైర్మెన్ గా మరియు 2021 లో జడ్పీటీసీ గా గెలుపొందారు. అయితే 2024 లో రాజంపేట నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. 4 దశాబ్దాలుగా టీడీపీ నే నమ్మకుని పనిచేస్తున్న తమ కుటుంబాన్ని పార్టీ పెద్దలే దారుణంగా అవమానిస్తున్నారని అందుకే వైసీపీలో చేరినట్లు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిదున్ రెడ్డి, ఎమ్మెల్యే లు పెద్దిరెడ్డి, అమర్నాధ్ రెడ్డి ,కడప మేయర్ సురేష్ బాబు , శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
