సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించడం జరిగింది. తాజాగా టీడీపీ ప్రకటించిన లోక్ సభ అభ్యర్థులు: విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు-మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప-భూపేశ్ రెడ్డి, అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ లను బరిలో దింపుతున్నారు. ఇది ఇలా ఉంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కు వియ్యంకుడు, సీనియర్ కీలక నేత, గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా పట్టు పట్టడంతో చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.
