సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను ప్రకటించారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి సభ నిర్వహించనున్నట్టు దానిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సుమారు 6 లక్షల మంది టీడీపీ అభిమానులు ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. టీడీపీని ఎన్డీఏలో ఆహ్వానించారని, ఈ మేరకు జరిగిన చర్చల విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందని, ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని అధినేతలిద్దరూ చెప్పారని అన్నారు. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని .. ( అభ్యర్థుల అధికారిక లిస్ట్ ఈనెలలో వచ్చే అవకాశము లేదు.. ) ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *