సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పాలకొల్లు పట్టణాలలో నేడు, ఆటో రిక్షా కార్మికులు ఆటోలు బంద్ నిర్వహించి టీడీపీ ఎన్నికల మ్యానిపెస్టో లో మహిళల కు ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం అన్న హామీని తొలగించాలని డిమాండ్ చేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళా మహిళా ఓటర్లు ను తమ వైపు త్రిపుకోవడానికి చంద్రబాబు టీడీపీ మ్యానిపెస్టో లో ఇటువంటి హామీలు ఇచ్చి తమ ఆటో డ్రైవర్స్ కుటుంబాల పొట్ట కొట్టవద్దని డిమాండ్ చేస్తూ ప్లే కార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ జిల్లా ఆటో యూనియన్ అడ్జక్షులు ఇంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరం బస్సు స్టాండ్ నుండి ప్రకాశం చౌక్ వరకు నేటి సోమవారం ఉదయం స్థానిక వందలాది ఆటో డ్రైవర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం చౌక్ వద్ద అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద 2 గంటల పైగా ధర్నా నిర్వహించారు. పోలీసులు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్స్ తో పరిస్థితిని సమన్వయము చేసారు. స్థానిక జేపీ రోడ్ లో కూడా ఆటో డ్రైవర్స్ టీడీపీ పార్టీ తమ పొట్ట కొట్టవద్దు అని ప్లై కార్డ్స్ ప్రదర్శిస్తూ ధర్నాలు చేసారు. పాలకొల్లులో కూడా ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేసి తక్షణం మ్యానిపెస్టో లో మహిళల కు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం తొలగించాలని విన్నతి పత్రాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కు అందజేశారు.
