సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశంలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మధ్య జరిగిన ఉద్రిక్తత ఫై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. .. రోజు అసెంబ్లీ చర్చలలో పాల్గొనకుండా సమావేశాలు అడ్డుకొనే తీరులోనే టీడీపీ సభ్యులు ప్రవర్తన ఉంటుందని, రోజు కాగితాలు చింపి నా ఫై విసిరి అవమానిస్తున్నారని , అయితే ఈ రోజు ..తెలుగుదేశంపార్టీ నేతలు దోషులుగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఫై సభలో చర్చ జరుగుతున్నపుడు నా పోడియం చుట్టూ ముగిపోయి ప్లై కార్డులు నాకు అడ్డుపెట్టి నా సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని అన్నారు. కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా తాను వాటిని పూవులుగానే భావించానని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు దుర్జన్యానికి దిగితే తానేమి గౌతమ బుద్ధుడిని కాదని అన్నారు.శ్రీరామ చంద్రుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నారని, రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసునని అన్నారు. టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని, సభకు, సభాపతి స్థానానికి గౌరవం లేకుండా వ్యవహరించారని విమర్శించారు.కాగా అసెంబ్లీలో స్పీకర్ పైకి దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు అని తెలుస్తుంది. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమపై వైసిపి ఎమ్మెల్యేలు దాడి చేసారని వాదిస్తూ అసెంబ్లీలో కింద కూర్చోని నిరసన చేపట్టారు. రోజులాగే 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా సస్పెండ్ కావడం గమనార్హం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *