సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తనపై లోకల్ రాజకీయాలు చేస్తున్న వారికీ మద్దతుగా తెలుగు దేశం పార్టీ అధిష్టానం వైఖరి మారక పొతే 48 గంటలలో తన టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తిరుపూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధించిన డెడ్ లైన్ నేటి శనివారం తో ముగియనుంది. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. పార్టీ నేతలు ఎంత సమన్వయపరచిన ఆయన నేడో రేపో రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. తనఫై పిర్యాదులు చేస్తున్న పార్టీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ అధిష్టానానికి కొలికపూడి అల్టిమేటం జారీ చేస్తున్నారు. అసలు తిరువూరు నియోజకవర్గంలో నేతల వివాదాలకు మూలం ఇసుక, మట్టి దోపిడీలలో వాటాల పంపిణి లో గొడవలు స్థానిక టాక్.. నిజంగానే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా? అధికారంలోకి వచ్చిన 10 నెలలు లో ఒక ఎమ్మెల్యే ఇలా ఎదురు తిరిగితే ఎలా? ఇంకెంతమంది ఇదే వైఖరితో ఉన్నారు అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. తిరువూరు లో పార్టీ వివాదంపై ఒక నివేదిక ఇవ్వాలని నెట్టు రఘురాం, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ రాజులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు లేదా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకొంటారని భావిస్తున్నారు.
