సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు, శనివారం శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో రొటీన్ కు బిన్నంగా కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను సీఎం పంచుకున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి ప్రజల మాటలను నమ్మకుండా ప్రజలతో సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని , వచ్చే ఎన్నికలలో టీడీపీ కి మరింత ఓట్ల శాతం పెరగాలని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అంతేకాదు పార్టీ కార్యకర్తల కు కూడా మేలు చేసేలా ఆర్థిక బలోపేతానికి ‘E3’ కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు.‘నా కుటుంబం బాగు కోసం ఏ విధంగా ఆలోచన చేశానో… టీడీపీ కార్యకర్తల కుటుంబం కోసం అదే విధంగా ఆలోచన చేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
